Sunday, May 5, 2024

తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్

తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో 100 శాతం ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ 28న జీవో నెంబర్ 34 విడుదల చేసిన ప్రభుత్వం జీవోపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 34 తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిందంటూ పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. సాగునీటికి ఉపయోగించాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వియోగిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అలా చేయడం ద్వారా నీరు వృథాగా సముద్రం పాలవుతుందని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, దీనిని సీజే ధర్మాసనమే విచారణ చేపట్టాలని ఏజీ కోరారు. నదీజలాల అంశం రోస్టర్ ప్రకారం సీజే ధర్మాసనానికి వస్తుందని తెలిపారు. జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనానికి సమాచారం ఇవ్వాలని సీజే తెలిపారు. సీజే సూచనలు జస్టిస్‌ రామచంద్రారావు బెంచ్‌కు ఏజీ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎన్జీటీని ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

Advertisement

తాజా వార్తలు

Advertisement