Friday, April 26, 2024

ICC Rankings | అండర్సన్‌ నెంబర్ 1.. రెండో స్థానంలో ఆశ్విన్‌, టాప్‌-10లోకి జడేజా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ రెండు స్థానాలు కిందకి పడిపోయాడు. టెస్టు బౌలింగ్‌లో నాలుగేళ్లుగా నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న ఇతను భారత్‌తో సిరీస్‌ కారణంగా వెనకబడ్డాడు. ప్రస్తుతం కమిన్స్‌ మూడవ స్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ (866) అగ్రస్థానం దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఏడు వికెట్లు పడగొట్టాడు. దాంతో, నలభై ఏళ్ల వయసులో ఈ స్పీడ్‌స్టర్‌ ఐసీసీ నంబర్‌ 1 టెస్టు బౌలర్‌ అయ్యాడు. నంబర్‌ 1 ర్యాంకు సాధించడం అతనికిది ఇది ఆరోసారి.

నలభై ఏళ్ల వయసులో వరల్డ్‌ నంబర్‌ 1 అయిన రెండో బౌలర్‌గా అండర్సన్‌ గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 682 టెస్టు వికెట్లు ఉన్నాయి. శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (800 వికెట్లు), ఆస్ట్రేలియా దివంగత లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ (708 వికెట్లు) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ లెజెండరీ బౌలర్‌ టెస్టుల్లో 32 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

అశ్విన్‌ నవంబర్‌ 2
టీమిండియా ఆటగాళ్లు ముందుకు దూసుకొచ్చారు. అండర్‌సన్‌ తర్వాత భారత టాప్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (864) రెండవ స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌తో జరిగే మూడవ టెస్టులో కూడా రాణిస్తే అశ్విన్‌కు నంబర్‌ వన్‌ బెర్తు దక్కుతుంది. గత ఆరు మాసాలుగా క్రికెట్‌కు దూరమైన బుమ్రా (795) ఐదవ ర్యాంకులోనూ, జడేజా (763) 9వ స్థానంలోను ఉన్నారు. రవీంద్ర జడేజా నాలుగేళ్ల తర్వాత తొలిసారి టాప్‌-10లోకి వచ్చాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా (460), అశ్విన్‌ (376) మొదటి రెండు ర్యాంకుల్లో నిలవగా, అక్షర్‌పటేల్‌ ఐదవ ర్యాంకు దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-10లో టీమిండియా బ్యాటర్లు ఇద్దరే ఉన్నారు. రిషబ్‌పంత్‌, రోహిత్‌శర్మ ఆరు, ఏడు ర్యాంకులలో కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement