Saturday, May 4, 2024

జనవరి 8న రిలీజ్ కానున్న.. అమిగోస్ టీజర్

బింబిసార చిత్రం విజయం సాధించడంతో మంచి జోరు మీదున్నాడు హీరో కల్యాణ్ రామ్ న‌టిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. డైరెక్టర్ రాజేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బింబిసారలో డ్యుయల్‌ రోల్‌లో కనిపించిన కల్యాణ్‌ రామ్‌ అమిగోస్‌లో కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయబోతున్నార‌ని ఇన్‌ సైడ్‌ టాక్‌.. కాగా దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం రాజేంద్రరెడ్డి అందిస్తున్నారు. గిబ్రాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆషికా రంగనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌ ను వదిలారు. ఈ సినిమా టీజర్‌ ను జనవరి 8వ తేదీన 11:07 AM గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు.కల్యాణ్ రామ్‌ ఇందులో పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement