Wednesday, May 1, 2024

అన్నమయ్య కీర్తనలు : కోరుదు నామది

ప|| కోరుదునామది ననిశము గుణాధరు నిర్గుణ కృష్ణుని
నారాయణు విశ్వంభరు నవనీతాహారుని ||కోరుదు||

చ|| కుండలిమణిమయ భూషణు కువలయదళ వర్ణాంగుని
అండజపతి వాహనుని అగణిత భవహరుని
మండనచోరక దమనుని మాలాలంకృత వక్షుని
నిండుకృపాంబుధి చంద్రుని నిత్యానందుని ||కోరుదు||

చ|| ఆగమపుంజ పదార్థుని ఆతప్సఖ సంభూతుని
నాగేంద్రాయత తల్పుని నానా కల్పుని
సాగబ్రహ్మమయాఖ్యుని సంతత గాన విలోలుని
వాగీశ్వర సంస్తోత్రుని వైకుంఠోత్తముని ||కోరుదు||

చ|| కుంకుమవసంత కాముని గోపాంగన కుచలిప్తుని
శంకర సతీమణి నుతుని సర్వాత్ముని సముని
శంకనినాద మృదంగుని చక్రాయుధ విదీప్తుని
వేంకటగిరి నిజవాసుని విభవ విధాయకుని ||కోరుదు||

Advertisement

తాజా వార్తలు

Advertisement