Thursday, April 25, 2024

డియర్‌ సోనూ సూద్‌. మీరు ఎంతో మందికి రోల్‌ మోడల్‌.. ట్వీట్ చేసిన రైల్వే అధికారులు

గ‌త నెల డిసెంబ‌ర్ 13న హీరో సోనూసూద్ ట్విట్ట‌ర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. అందులో అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్‌ ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించారు. హ్యాండ్‌రైల్ పట్టుకుని రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు తాజాగా స్పందించారు. రియల్‌ హీరోని సున్నితంగా హెచ్చరించారు.

రైల్లో ఇలా ప్రయాణించడం చాలా ప్రమాదకరమని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘డియర్‌ సోనూ సూద్‌. మీరు ఎంతో మందికి రోల్‌ మోడల్‌. ఇలా రైలు మెట్లపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇలాంటి వీడియోలతో మీ అభిమానులకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. మరోసారి ఇలాంటివి చేయకండి. రైలు ద్వారా సున్నితమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అంటూ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement