Saturday, May 4, 2024

డిసెంబ‌ర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో య‌శోద‌.. రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం య‌శోద‌..ఈ చిత్రానికి హరి- హరీష్ దర్శకత్వం వహించారు. నవంబరు 11న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. తొలి రోజే పాజిటివ్ టాక్‌‌ని సొంతం చేసుకుని రూ.30 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది.శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ విలన్ గా నటించింది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం ఓటీటీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. యశోద మూవీ ఓటీటీ రైట్స్‌ని ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ భారీ ధరకి దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ప్లాట్‌ఫారమ్‌లో డిసెంబర్ 9, 2022న ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేస్తుంది. ఈ మేరకు ప్రకటన వచ్చిందిఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ లాభాలు వచ్చాయని సమాచారం. సరోగసీ నేపధ్యంలో క్రైమ్ ఎలిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రని పోషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement