Thursday, May 16, 2024

అమెరికా స్వర్గధామం కాదు.. ప‌రిస్థితులు మారుతున్న‌య్‌

అమెరికా ఇక ఎంత మాత్రం స్వర్గ ధామం కాదు.. అక్కడి పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. నలభై ఏళ్ళ గరిష్టానికి ఆర్థిక మాంద్యం పెరిగిం దని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యావసర ధరలు, భూముల ధరలు, వస్త్రాల ధరలు ఒకటేమిటి ప్రజలు వినియోగించే అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుుతున్నాయి. ప్రజల జీవన వ్యయం దారుణంగా పెరిగింది. భారీగా పెరిగిన నిత్యావసరాలు అమెరికాలో మాత్రం నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఇంధనం ధరలు 34 శాతం పెరిగాయి,కరోనా సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలు అయింది. ఉద్దీపన పథకాల కింద అమెరికాలో ప్రజలకు అందించిన సాయం ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థపై పడింది.అమెరికాలో ఇప్పుడు ఇళ్ళు కొనాలంటే చాలా కష్టం.అలాగే,ఇళ్లలో ఫర్నిచర్‌,ఇతర హంగుల కోసం చేసే ఖర్చులు బాగా పెరిగిపోయాయి.

దెబ్బతీసిన ఉక్రెయిన్‌ యుద్ధం
కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న సమయంలో ఉక్రెయిన్‌ యుద్దం అమెరికా ఆర్థిక పరిస్థితిని బాగా దెబ్బతీసింది. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అన్ని దేశాలూ ఆర్థికం గా అస్తవ్యస్తం అయినప్పటికీ, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపి వేయ డం , రష్యా కరెన్సీతో లావాదేవీలు నిలిపి వేయడంతో పరిస్థితి మరీంతక్షీణిం చింది. చమురు ధర32 శాతం పెరిగింది. గ్యాలన్‌ పెట్రోల్‌ ధర ఐదు డాలర్లకు పెరి గింది. ఇది ఏడాదిలో 48 శాతం పెరిగింది. ఆహార ధాన్యాలూ, నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి. అమెరికాలో సామాన్య, మధ్యతరగతి జనం వేతనాలు చాలక అల్లాడుతున్నారు. అమెరికాలో ప్యాక్‌డ్‌ ఫుడ్స్‌, మిల్క్‌, ఒకటేమిటి
అన్నీంటి ధరలు పెరిగి పోయాయి.

ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ చేసిన వ్యాఖ్యలకు జనం ఆగ్రహంతోఊగిపోతున్నారు. బిడెన్‌కి పాలనపై పట్టు లేదని రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. బిడెన్‌ కన్నా ట్రంప్‌ ఎన్నోవిధాల మేలు అని పొగుడుతున్నారు. మొత్తం మీద అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నా యన్నమాట వాస్తవం. అంతేకాక, అమెరికా వాణిజ్యాభివృద్ది చైనాదూకుడుతో దెబ్బతింది. ట్రంప్‌ హయాంలోనే ఇది కనిపించింది. అందుకే ట్రంప్‌ తరచూ చైనాపై విమర్శలు చేసేవారు. అమెరికాతో వాణిజ్యం తగ్గించేశాడని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తర తూ విమర్శలు కురిపించేవారు. అమెరికా వాణిజ్యాన్ని చైనా కొల్లగొట్టిందని అనేవారు. మన దేశం అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచు కోవడం వల్ల, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగిఉండటం వల్ల ఎక్కువ నష్ట పోయింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ యుద్దంపై తటస్థ వైఖరిని అనుసరిస్తుండ టం వల్ల చమురు విషయంలో ఇబ్బందులకు గురి కావడం లేదు.

అమెరికాలో ప్రస్తుతం ఆర్థిక మాంద్యానికి దారి తీసే పరిస్థితుల కారణంగానే మన రూపాయి విలువ పతనమైందనే అభిప్రాయం సరైనదే. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు ఎం త దారుణంగా ఉన్నా డాలర్‌ విలువను పెంచుకుంటూ మార్కెట్లను మంచిఊపు లో ఉంచడంలో అమెరికన్‌ ఆర్థిక శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. వివిధ దేశాలపై ఆర్థిక,వాణిజ్యపరమైన ఆంక్షలు విధిస్తున్నారు. అమెరికా దూకుడుకు ఉక్రెయిన్‌ యుద్ధం బ్రేకు వేసింది. అది రాకుండా ఉండి ఉంటే అమెరికా ఆర్థిక మాంద్యానికి దూరంగా ఉండేది. ఉక్రెయిన్‌ వంటి దేశాలను రెచ్చగొట్టి రష్యా ఆర్థి క మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నించిన కారణంగానే అమెరికా ప్రస్తుత సంక్షోభాన్నిఎదుర్కొంటోందనీ, తాను తీసిన గోతిలో తానే పడిందని అంతర్జా తీయ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement