Friday, April 26, 2024

మే నెలలో రాబోతున్న ‘ఫ్యామిలీ మేన్ 2’

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి కూడా అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. 2019లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత న‌టించడంతో అంచ‌నాలు భారీగా పెరిగాయి. అయితే ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కావ‌ల‌సిన ఈ వెబ్ సిరీస్ ప‌లు కార‌ణాలతో వాయిదా ప‌డింది. అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా మే నెలలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో మనోజ్ బాజ్‌పేయ్ ఎన్ఐఏ ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా నటించగా.. ఆయనకు వ్యతిరేకంగా సమంత ఉగ్రవాది పాత్రలో రాజీగా క‌నిపించ‌నుంది. ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని వివాద‌స్ప‌ద సీన్స్ ఉండ‌డంతో వాటిని రీ షూట్ చేశార‌ని, అందుకే రిలీజ్ కాస్త లేట్ అయింద‌ని అంటున్నారు. ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇందులో స‌మంత నెగిటివ్ షేడ్‌లో న‌టిస్తుంద‌ని, ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని విధంగా ఈ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement