Monday, May 13, 2024

అమెజాన్ ఉచిత గిఫ్టు.. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

అమెజాన్‌కు సంబంధించిన ఓ ఫేక్ లింక్ వాట్సాప్‌లో తెగ వైరల్ అవుతోంది. 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమెజాన్ ఉచితంగా బహుమతులు ఇస్తుందని సదరు లింకులో పేర్కొన్నారు. నిమిషంలో నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే కొన్ని గిఫ్ట్ బాక్స్‌లు వస్తాయని, అందులో గిఫ్ట్ గెలుచుకుంటే అడ్రస్ ఎంటర్ చేయాలని, లింక్ ఇతరులకు షేర్ చేయాలని ఉంది. దీంతో చాలా మంది లింక్ ఓపెన్ చేసి సమాధానాలు ఇస్తూ.. ఆ లింకును పలువురికి పంపుతున్నారు. కానీ ఏ గిఫ్టులు రావడం లేదని నిరాశ చెందుతున్నారు.

కాగా ఇలాంటి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్లు యూజర్ల సమాచారాన్ని కొల్లగొట్టే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు బహుమతులు ఇస్తుంది నిజమే అని మెసేజ్‌లు పెడుతున్నారు. ఇవి నిజమో.. కాదో అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement