Wednesday, May 29, 2024

RR : ఓటు హ‌క్కువినియోగించుకున్న క‌లెక్ట‌ర్‌, ప్ర‌ముఖులు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరుగుతున్న ఎన్నికల కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ వద్ద పెద్ద మొత్తంలో మహిళలు బారులు తీరారు. అలాగే ఓటు హ‌క్కును ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్య‌ర్థులు, క‌లెక్ట‌ర్‌లు, ప్ర‌ముఖులు వినియోగించుకున్నారు.

- Advertisement -

వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో గల 11:48 పోలింగ్ స్టేషన్లో ఉదయం 9 గంటలకు 7% పోలింగ్ నమోదయినట్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ జిల్లా ఎస్పీ కోటితో కలిసి ఆయన పరిశీలించారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో రైతు కాలనీలో గల బూత్ నంబర్248 లో నిర్మాత బండ్ల గణేష్ ఆయన సతీమణి తదితర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం వీర్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో సోమవారం నాడు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి జిల్లా కేంద్రంలోని సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్లో 90 ఏళ్ల వృధాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీల్ చైర్ లో వచ్చిన ఆమెకు సంబంధిత పోలింగ్ స్టేషన్ అధికారులు ఓటింగ్ హాల్లోకి తీసుకువెళ్లి ఓటు వేయించారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అతి కీలకమైనదని ప్రజా ప్రతినిధుల్లో ఎన్నుకోవడంలో ఓటు ఎంతో వినియోగం అవుతుందని మంచి నాయకులను ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ లోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సతీమణి రాగిడి రజిని, కుమార్తె డాక్టర్: మౌనిక రెడ్డితో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement