Tuesday, May 28, 2024

HYD : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

హైదరాబాద్​లోని ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అని తెలిపారు.

- Advertisement -

నాగోల్ డివిజన్ లోని హరి హర గ్రామర్ స్కూల్ లో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త , కుటుంబ సభ్యులు ఉప్పల స్వప్న ,ఉప్పల సాయి కిరణ్ ,ఉప్పల సాయి తేజ లు . ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్,మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ సోమవారం ఉదయం హయత్ నగర్ ఓల్డ్ విలేజ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పల్లవి మోడల్ స్కూల్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు..

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ మధుకర్ రెడ్డి, భాగ్యనగర్ బిజెపి ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి డివిజన్ పరిధిలోని నాగార్జున కాలనీ లిబర్టీ హాల్లో ఓటు హక్కును వినియోంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement