Thursday, April 25, 2024

భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులకు అనుమతి

బ్రిట‌న్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అక్కడి అధికారులు కోవిడ్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామ‌ర్థ్యానికి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్నాయి. దీంతో భారత్, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఫుల్ హౌజ్ కెపాసిటీ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇప్పుడు అమ‌ల్లో ఉన్న కొన్ని ఆంక్ష‌లు కూడా ఎత్తేసేందుకు ఈ నెల 12న ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత మాస్క్‌లు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం కూడా అవ‌స‌రం లేదు. అయితే కొన్ని స్టేడియాల్లో మాత్రం ఎన్‌హెచ్ఎస్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ను కావాల‌నుకుంటే త‌ప్ప‌నిస‌రి చేసుకోవ‌చ్చ‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ స్ప‌ష్టం చేశారు.

భారత్, ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు ఆగ‌స్ట్ 13న ప్రారంభ‌మ‌య్యే కొత్త ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌కు కూడా పూర్తిస్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్నారు. ఆగ‌స్ట్ 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మ‌ధ్య టెస్ట్ ప్రారంభం కానుంది. యూకేలో క‌రోనా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ స్టేడియాల్లోకి అయితే పూర్తిగా అనుమ‌తించ‌డం, లేదంటే అస‌లు అనుమ‌తించ‌క‌పోవ‌డం చేస్తున్నారు. ఈ మ‌ధ్య ప్ర‌భుత్వం చేప‌ట్టిన పైల‌ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా స్టేడియాల్లో పూర్తిస్థాయిలో ప్రేక్ష‌కుల‌ను కొన్ని టెస్ట్ ఈవెంట్లు కూడా నిర్వ‌హించారు. వింబుల్డ‌న్‌లోనూ ఇప్ప‌టికే పూర్తిస్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్నారు.

ఇది కూడా చదవండి: డిసెంబరులో ఐపీఎల్ వేలం

Advertisement

తాజా వార్తలు

Advertisement