Monday, May 6, 2024

డిసెంబర్ లో ఐపీఎల్ వేలం..

ఐపీఎల్ 2022 సీజన్‌ని 10 జట్లతో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు కోసం సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ (కోల్‌కతా), అదానీ గ్రూప్‌ (అహ్మదాబాద్‌), అరబిందో ఫార్మా (హైదరాబాద్‌), టొరెంట్‌ గ్రూప్‌ (గుజరాత్‌) సహా మరికొన్ని వ్యాపార సంస్థలు పోటీ పడనున్నాయి. ఏదేమైనా అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్‌ దక్కించుకోనుందని సమాచారం. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేయనుంది. డిసెంబర్లో భారీ వేలం నిర్వహించనుంది. 2022 జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలవనుంది.

ఇక రెండు జట్లు కొత్తగా టోర్నీలోకి వస్తుండటంతో.. ఓ కొత్త రూల్‌ని కూడా బీసీసీఐ తీసుకొచ్చింది. దాంతో.. అన్ని ఫ్రాంఛైజీల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలకి గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని మాత్రమే రిటైన్ చేసుకునే వెసులబాటు ఉంటుంది. అది ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లా అనేది ఫ్రాంఛైజీల ఇష్టం. వారు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జీతాల్ని.. వేలానికి ముందు ఫ్రాంఛైజీల పర్స్ వాల్యూ నుంచి తగ్గించనున్నారు. కాగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు, ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి.

ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు పెంచింది. అంటే పది ఫ్రాంచైజీల నుంచి రూ.50 కోట్లు జమ అవుతుంది. ఫ్రాంచైజీలు ఇందులో కనీసం 75% ఖర్చు చేయాలి. ఏటా రూ. 5 కోట్లు పెంచుతూ 2024కు ఈ జీతాల నిధిని రూ.100 కోట్లకు చేరుస్తారని తెలిసింది. పది జట్లతో నిర్వహించే ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని అంచనా. ఎందుకంటే ఎనిమిది జట్లతో 60 మ్యాచులే నిర్వహిస్తున్నారు. అదే పది జట్లతో అయితే 90కి పైగా మ్యాచులు ఉంటాయి. దాంతో 25% ఎక్కువ ధర లభిస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: మ్యాచ్ మధ్యలో గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement