Tuesday, May 7, 2024

SBI అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..ఇలా అప్లై చేయండి..

నిరుద్యోగులకు శుభవార్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 6100 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అక్టోబర్ 31 నాటికి 20 -28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాగే రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విభాగంలో 125 ఖాళీలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 100 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (జూలై 6)నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 26 చివరితేదీ.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు sbi.co.in వెబ్‏సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఒక స్టేట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. పూర్తి వివరాల కోసం https://www.sbi.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఎంపిక ప్రక్రియ..
స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు తొలగిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఆగస్టు 2021లో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ రూ. 300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఇది కూడా చదవండి:తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు ఓపెన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement