Sunday, April 28, 2024

Alert – మ‌రికొన్ని గంట‌ల‌లో కుంభ‌వృష్టి – హైదరాబాద్‌లో హై అలర్ట్

హైదరాబాద్‌: మ‌రికొన్ని గంట‌ల‌లో జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియ‌నుంది.. దీంతో జంట‌న‌గ‌ర‌వాసుల‌ను ను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగరంలో హై అలర్ట్‌ ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 9000113667 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలకు ఇంటినుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. పిల్ల‌ల‌ను, వృద్దుల‌ను ఒంట‌రిగా బ‌య‌ట‌కు పంప‌వ‌ద్ద‌ని కోరింది.. అస‌ర‌మైతే అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement