Tuesday, May 7, 2024

Gold- మదనపల్లెలో కిలో టమాటా @ 168

మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది. దీంతో మదనపల్లె మార్కెట్‌కు కేవలం 361 టన్నులు మాత్రమే రైతులు తీసుకువచ్చారు. బుధవారం నాణ్యమైన టమాటా అత్యధికంగా కిలో రూ.168 పలికింది. మార్కెట్‌లో ఏ గ్రేడ్‌ కిలో రూ.140 నుంచి రూ.168 వరకు, బిగ్రేడ్‌ కిలో రూ.118 నుంచి రూ.138 వరకు ధర పలుకుతుందని మార్కెట్‌ యార్డు కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు.

సగటున కిలో రూ.132 నుంచి రూ.156 వరకు ఉందని చెప్పారు. ఇది హోల్ సేల్ మార్కెట్ ధ‌ర‌.. రిటైల్ కు వచ్చేస‌రికి రూ.200 పైనే ఉంటుంద‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement