Thursday, May 16, 2024

బాధ్యతలు చేపట్టిన ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ తన అనుబంధ విభాగాలను పటిష్టం చేసుకుంటూ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఏఐసీసీ ఓబీసీ విభాగంలో నేషనల్ కోఆర్డినేటర్లను నియమించిన ఏఐసీసీ, వారికి వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ కోఆర్డినేటర్ డా. కేతూరి వెంకటేశ్ తమిళనాడు వ్యవహారాల ఇంఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు కెప్టెన్‌ అజయ్‌ సింగ్‌ యాదవ్‌ వెంకటేష్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళీకృష్ణ కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పార్టీ పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ యువతకు ప్రాధాన్యతనిస్తూ అవకాశాలు కల్పిస్తున్నారని డా. కేతూరి వెంకటేశ్ అన్నారు.

తాము గత కొన్నేళ్లుగా పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని, తమ కృషిని గుర్తిస్తూ పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ వంటి బడుగు బలహీనవర్గాలకు నాయకత్వం అవకాశాలు కల్పిస్తుందని కేతూరి వెంకటేశ్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement