Saturday, May 4, 2024

ఆకాశంలో అఫ్గాన్‌ మహిళకు పురిటి నొప్పులు.. విమానంలో ప్రసవం

ఆఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో గత పాలనా అనుభవాలు దృష్ట్యా స్థానికులూ అఫ్గాన్‌ను విడిచి ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అమెరికా విమానం ఎక్కిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. శనివారం అఫ్గాన్‌కు చెందిన ఓ నిండు గర్భిణి.. యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ సీ-17 విమానం ఎక్కారు. ఇది జర్మనీలోని అమెరికాకు చెందిన రామ్‌స్టెయిన్‌ బేస్‌కు వెళ్తోంది. ప్రయాణ క్రమంలో భూమి నుంచి 8500 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానంలో లో ఎయిర్‌ ప్రెషర్‌ ఏర్పడడంతో మహిళకు నొప్పులు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది ఎదురైంది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ వెంటనే విమానాన్ని తక్కువ ఎత్తుకు తీసుకొచ్చారు. లోపల వాయు పీడనాన్ని పెంచి.. ఆమె ప్రాణాలను నిలిపారు. జర్మనీలో ల్యాండ్‌ అయ్యాక వైద్య సిబ్బంది హుటాహుటిన ఆమె వద్దకు చేరుకుని విమానంలోనే ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement