Tuesday, May 14, 2024

Aditya L1 | చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఆదిత్య ఎల్-1

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.. సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రారంభించింది. కాగా, ఈ మిషన్ త్వరలో చివరి దశకు చేరుకుంటుంది. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 6న త‌న‌ గమ్యస్థానానికి (ఎల్-1 పాయింట్‌కు) చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఆ రోజున కచ్చితమైన వివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు.

స్పేస్‌క్రాఫ్ట్ ఎల్-1 పాయింట్‌కి చేరుకోగానే ఇంజన్ మరోసారి మండుతుందని సోమనాథ్ తెలిపారు. తర్వాత, అంతరిక్ష నౌకను ఎల్-1 కేంద్రంలో స్థిరపరుస్తామని, విజయవంతంగా ఆ స్థానానికి చేరుకున్న తర్వాత అక్కడ కక్ష్యలో కొనసాగుతుందని వివరించారు. ఆదిత్య ఎల్1 ద్వారా సేకరించిన డేటా సూర్యుడిలో వచ్చే మార్పులు, మానవ జీవితంపై వాటి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఐదేళ్లపాటు ఉపయోగపడుతుందని సోమనాథ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement