Thursday, May 2, 2024

రికార్డ్ సృష్టించిన‌నున్న ఆదిపురుష్ .. 105థియేట‌ర్స్ లో ట్రైల‌ర్

స్టార్ హీరో ప్ర‌భాస్ రాముడిగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు ఆదిపురుష్ చిత్రంతో. కృతి సనన్ సీతగా నటించారు. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రావణుడుగా కనిపించనున్నారు. వరల్డ్ వైడ్ ఆదిపురుష్ ఐదు భాషల్లో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. కాగా ఈ మూవీ ట్రైలర్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 105థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో ఆదిపురుష్ ట్రైలర్ విడుదల చేసే థియేటర్స్ లిస్ట్ విడుదల చేశారు. మే 9న ఆదిపురుష్ త్రిడీ ట్రైలర్ విడుదల కానుంది. సాయంత్రం 5:30 నిమిషాలకు థియేటర్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైంది. విజువల్స్, ప్రధాన పాత్రల గెటప్స్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రైలర్ విషయంలో అలా జరగకూడదని థియేటర్స్ లో విడుదల చేసి త్రీడీ ఎక్ప్పీరియన్స్ తో థ్రిల్ చేయాలని మేకర్స్ ఆలోచన. ఆ విధంగా గతంలో ఎదురైన విమర్శలను అధిగమించాలని చూస్తున్నారు.ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. టి సిరీస్ సంస్థ ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement