Friday, April 26, 2024

ఆదిపురుష్ కి డ‌బ్బింగ్ స్టార్ట్ చేశా-కృతిస‌న‌న్

బాలీవుడ్ హీరోయిన్ కృతిస‌న‌న్ ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి అప్ డేట్ ని అందించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2023 జ‌న‌వరి 12న సంక్రాంతి కానుక‌గా ఆదిపురుష్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోగా స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఇందులో సీత పాత్ర‌లో న‌టిస్తోంది కృతిస‌న‌న్. త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం షురూ చేసింది కృతిస‌నన్. ఈ విష‌యాన్ని త‌న డైలాగ్స్ కు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తెలియ‌జేసింది. హై వీఎఫ్ఎక్స్ టెక్నాల‌జీతో వ‌స్తున్న ఈ చిత్రాన్ని ఓంరౌత్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుండ‌గా..సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వ‌రుడైన రావ‌ణాసుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. బాలీవుడ్ న‌టుడు స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో, దేవ్‌ద‌త్తా న‌గే హ‌నుమంతుడిగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి సాచెట్‌-ప‌రంప‌ర ధ్వ‌యం మ్యూజిక్ అందిస్తున్నారు. ఆదిపురుష్ 3డీ ఫార్మాట్ టీజ‌ర్ కు అద్బుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement