Friday, April 26, 2024

అడ‌విశేషు – ఐదు హిట్లు

అడ‌విశేషు ఇప్పుడు ఈ పేరు తెగ మారు మ్రోగుతోంది. దానికి కార‌ణం మేజ‌ర్ చిత్రం. అడివి శేషు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారాడు. అడివి శేషు డైరెక్టర్ కమ్ హీరో గా సొంతంగానే సినిమాలు తీసుకున్నాడు. అయితే దర్శకుడిగా ఊహించని అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ అతను రచయితగా మాత్రం మంచి గుర్తింపు అందుకున్నాడు. చాలామంది దర్శక నిర్మాతల నుంచి కూడా అతనికి రచయితగా మంచి గుర్తింపు లభించింది. అడవి శేష్ హీరోగానే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో అతని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఇతర హీరోల సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. పంజా సినిమాలో అతను చేసిన పాత్ర చాలా బాగా వర్కౌట్ అయింది.

ఆ తర్వాత బలుపు.. బాహుబలి ఇలా కొన్ని సినిమాల్లో శేష్ చేసిన పాత్రలకు మంచి క్రేజ్ లభించింది.హీరోగా అడవి శేష్ చేసిన గత ఐదు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించడం విశేషం. 2016లో క్షణం సినిమాతో అతను చేసిన ప్రయోగం నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి క్రేజ్ అందించింది. ఆ తర్వాత కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేసిన మొదటి సినిమా ఆమీ తూమీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.డిఫరెంట్ స్పై మూవీ గూడచారి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందజేసింది. ఇప్పుడు మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంతో వ‌రుస‌గా 5హిట్స్ కొట్టాడు అడివి శేషు.

Advertisement

తాజా వార్తలు

Advertisement