Saturday, May 4, 2024

సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు మృతి

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్​ నటుడు అనుపమ్​ శ్యామ్ ​(63) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన అనుపమ్ శ్యామ్‌ని గోరేగావ్‌లోని ఓ ఆసుప్రతిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఆయన కన్నుమూశారు.

హిందీలో ప్రసారమయ్యే ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’తో బాగా ఫేమస్ అయిన అనుపమ్ శ్యామ్ పలు టీవీ సీరియల్స్‌తో ఎన్నో సినిమాల్లో నటించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బండిట్ క్వీన్‌ చిత్రాల్లో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి.  ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: ‘మా’ ఎన్నికల వివాదం.. హేమ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నరేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement