Sunday, April 28, 2024

యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ అన్‌చార్టెడ్‌.. ఈ నెల 15న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ!

టామ్ హాలండ్ న‌టించిన‌ యాక్షన్-అడ్వెంచర్ అడాప్షన్ అన్‌చార్టెడ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. అన్‌చార్టెడ్ వీడియో గేమ్ సిరీస్‌కి రిలేట‌డ్ గా వ‌చ్చి మూవీ ఇది. క‌రొనా కారణంగా చాలాసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. విమర్శకుల నుండి మంచి టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బాక్స్ ఆఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌లేదు.

యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ గా తెర‌కెక్కిన ఈసినిమాలో నాథన్ డ్రేక్‌గా టామ్ హాలండ్ నటించారు. ఒక పురాణ నిధిని కనుగొనడానికి మార్క్ వాల్‌బర్గ్‌తో క‌లిసి బ‌యలుదేరిన అన్వేషకుడిగా నాథ‌న్ డ్రేక్ ఉంటాడు. అయితే ఈ సినిమా త్వ‌ర‌లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. జులై 15న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సర్వీస్‌లో అన్‌చార్టెడ్ సినిమా అందుబాటులో ఉండ‌నున్న‌ట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement