Sunday, May 5, 2024

ఎందుకో అంత‌ కోపం.. రుద్ర‌న్‌లా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న లారెన్స్‌!

కతిరేసన్ దర్శకత్వంలో రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్న రుద్ర‌న్ సినిమాకి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. అయితే.. తాజా అప్ డేట్ ఏంటంటే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన‌ ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేసింది మూవీ టీమ్. రాఘవ లారెన్స్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు తెలిపారు. దీంతో పాటు ఒక పొస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్ట‌ర లో రాఘవ లారెన్స్ కోపంగా క‌నిపిస్తూ.. చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని సోఫాలో కూర్చుని ఉంటారు.

ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కతిరేసన్, తన సోంత‌ నిర్మాణ సంస్థ అయిన‌ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పితో ఈ సినిమాకి నిర్మాన బాధ్య‌త‌లు వ‌హిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ డా నటిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కెపి తిరుమారన్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. ఈ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . కాగా.. రుద్రన్‌తో పాటు, చంద్రముఖి 2, KS రవికుమార్ దర్శకత్వంలో అతని సోదరుడు ఎల్విన్‌తో ఒక చిత్రం, దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వ‌లో అధిగారం అనే ప్రాజెక్ట్స్ రాఘవ లారెన్స్ కు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement