ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుతం భావిస్తున్నది. కానీ దీనికి అడ్డంకిగా ఉన్న 1949 నాటి బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి ప్రస్తుతం కేంద్రం సవరణ చేయబోతున్నది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. ప్రభుత రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 20 శాతం మించి ఉండకూడదు. దీనికి సంబంధించిన కేబినెట్ ముందుగా సవరణ ఆమోదానికి రానుంది. ఈ ఆర్థిక సంవత్సరం వాస్తవానికి రెండు పీఎస్‌బీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి కావాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు, మార్కెట్ ఒడిదొడుకులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అనిశ్చితి కొనసాగుతున్నందున ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
ఏ బ్యాంకులను కేంద్రం ప్రైవేటీకరిస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు. నీతి ఆయోగ్ సిఫారసు వివరాల ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో ఈ రెండు బ్యాంకుల సిబ్బందికి త్వరలోనే వీఆర్‌ఎస్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు మాత్రం దీనిపై నేరుగా ప్రభుత్వంతోనే తెల్చుకుంటామని అంటున్నాయి. విషయం సమ్మెదాకా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..