Thursday, December 5, 2024

Pushpa | అల్లు అర్జున్‌తో శ్రీలీల రొమాన్స్‌!

  • పుష్ప-2 ప్రత్యేక పాట‌లో శ్రీలీల స్టెప్స్‌
  • అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌
  • శ్రీలీల పోస్టర్‌ విడుదల

ఆంధ్రప్రభ, హైదరాబాద్​: అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై, సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉన్న ఈ చిత్రం మరో వైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా ఈ చిత్రంలో ఉన్న ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోయే హీరోయిన్‌ గురించి కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌, పూజా హెగ్డే, సమంత ఇలా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న ప్రత్యేక పాట‌లో హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు వేయ‌బోతున్న‌ట్టు మేకర్స్‌ అఫీషియల్‌గా తెలియజేశారు.

- Advertisement -

ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు గణేష్‌ ఆచార్య కొరియోగ్రఫీని అందిస్తున్నట్లుగా తెలిసింది. ‘పుష్ప ది రైజ్‌’ చిత్రంలో సమంత చేసిన ఊ అంటావా.. మామా ఊఊ అంటావా ఐటెమ్‌సాంగ్‌ ఎంతటి పాప్యులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు తాజాగా ‘పుష్ప-2’ ది రూల్‌లో శ్రీలీల, అల్లు అర్జున్‌లపై మాసివ్‌గా ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. డ్యాన్స్‌ల విషయంలో ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్న అల్లు అర్జున్‌, డ్యాన్సుల్లో తన కంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ను పొందిన శ్రీలీల ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ఈ సాంగ్‌ పూర్తి మాసివ్‌గా ఉండబోతుందని తెలిసింది. త్వరలోనే ఈ పాట లిరికల్‌ వీడియోను కూడా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement