Sunday, May 19, 2024

శవపేటికలో మూడేళ్ల చిన్నారి బ‌తికింది.. ఆ వెంటనే మరోసారి కన్నుమూత

మెక్సికోలో మూడేళ్ల చిన్నారి అంత్యక్రియలకు సిద్ధంగా ఉండగా శవపేటికలో కదలికలుమొదలయ్యాయి. వెంటనే గుర్తించిన బంధువులు.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. కడుపు ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మూడు సంవత్సరాల కమిలా రొక్సానా సెంట్రల్‌ మెక్సికోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 17న మృతిచెందింది. సెంట్రల్‌ మెక్సికోలోని శాన్‌లూయీస్‌ పొటసీ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. చిన్నారి కమిలా తల్లి బిడ్డకు వాంతులు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతోందని ప్రముఖ వైద్యుని వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపింది. అయితే అక్కడి డాక్టర్‌ చిన్నారి డీ హైడ్రేషన్‌తో బాధపడుతుందని కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని చెప్పారు.

ఆ సమయంలో చిన్నారికి పారాసెట్‌మాల్‌ అందించాలని వైద్యలు సలహా ఇచ్చారు. చిన్నారికి ఆక్సిజన్‌తోపాటు సెలైన్‌ ఎక్కించడానికి నాడులు దొరకక పోవడంతో ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం కమిలా అంత్యక్రియలకు సిద్ధం చేశారు. చిన్నారి అత్త మేరీ పేటికలోని చిన్నారి కదలికలను గమనించింది. అపస్మారక స్థితిలో ఉందని చనిపోలేదని కదలికలు గమనించామని పేటికను తెరిచి చూస్తే నాడీవ్యవస్థ సజీవంగా ఉన్నట్లు.. గుర్తించి వెంటనే మరోసారి ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి మరోసారి చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement