Wednesday, May 15, 2024

ప్యారడైజ్ బిర్యానీ… ఇచ్చట పురుగులు లభించును

బిర్యానీ పేరు చెప్తే ఎవరికైనా నోరు ఊరుతుంది. అదీ హైదరాబాద్ బిర్యానీ అంటే ఇంక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోను ప్యారడైజ్ బిర్యానీ అంటేబిర్యానీ మాములుగా ఉండదు. అయితే అదే బిర్యానీలో పురుగులు వస్తే.. !!అవును మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్యారడైజ్ రెస్టారెంట్ లో బిర్యానీ తింటున్న ఓ వ్య‌క్తి పురుగులు రావ‌టాన్ని చూశాడు.

మ‌రో ఆర్డ‌ర్ లో డ‌బుల్ కా మీఠా స్వీట్ ఆర్డ‌ర్ చేసాడు… అందులోనూ మళ్ళీ పురుగు వచ్చింది. వెంటనే ఇంకేం ఆలోచించకుండా మున్సిప‌ల్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది అధికారులు హోట‌ల్ ను తనిఖీ చేయ‌గా… నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు చికెన్, మటన్ కుళ్లిపోయి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకొని హోటల్ ను సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement