Thursday, May 2, 2024

Asia cup | దంచికొట్టిన బంగ్లా.. ఆఫ్ఘాన్ ముందు భారీ టార్గెట్

ఆసియాకప్ 2023 లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) పాకిస్తాన్ గడ్డాఫీ స్టేడియం వేదిక‌గా బంగ్లాదేశ్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతుండగా.. ఆఫ్ఘాన్ బౌల‌ర్ల‌పై ప‌రుగుల వ‌ర్షం కురిపించింది బంగ్లాదేశ్ జ‌ట్టు. ఈ మ్యాచ్ లో తొలుత‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా… నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 334 ప‌రుగులు చేసింది.

దీంతో ఆఫ్ఘాన్ ముందు 335 పరుగుల‌ భారీ టార్గెట్ ని సెట్ చేయ‌గ‌లిగిందిం బంగ్లా జ‌ట్టు. కాగా, బంగ్లాదేశ్ జ‌ట్టులో అత్య‌ధికంగా మెహిదీ హసన్ మిరాజ్ (112), నజ్ముల్ హుస్సేన్ శాంటో (104) ప‌రుగుల‌తో ఇద్ద‌రూ చ‌రో శ‌త‌కం బాదారు. కాగా, 335 ప‌రుగుల భారీ ల‌క్షంతో మ‌రి కొద్ది సేప‌ట్లొ బ‌రిలోకి దిగ‌నుంది ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement