Saturday, May 18, 2024

సొంత గ‌డ్డ‌పై 5000 ప‌రుగులు.. స‌చిన్ త‌ర్వాత కోహ్లీదే రికార్డు..

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ జట్టు సారథిగా వైదొలిగినా రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో సెంచరీ కరవుకు చెక్‌ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే గత రెండేళ్లలో ఏ ఫార్మాట్‌లోనూ కోహ్లీ మూడంకెల స్కోరును సాధించడంలో విఫలమయ్యాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో 33ఏళ్ల కోహ్లీ మరో వ్యక్తిగత మైలురాయికి చేరుకోనున్నాడు. సొంతగడ్డపై వన్డేల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

భారత్‌లో 6వేలకుపైగా వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఏకైక బ్యాటర్‌గా సచిన్‌ 6976 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్‌ తన 121వ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌పైనే భారత్‌ 5వేల వన్డే పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. మరోవైపు ఆదివారం జరిగిన తొలివన్డేలో కోహ్లీ 8పరుగులు చేసిన కోహ్లీ 5002 పరుగులుతో 5వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement