Thursday, July 29, 2021

ఇండియా లో కొత్తగా 38,792 కేసులు @కరోనా అప్డేట్

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,792 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా 624 మంది మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 41వేల మంది కరోనా నుంచి కొలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 3,09,46,074కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య‌ 3,01,04,720కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 4,29,946కి చేరింది. అలాగే మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,11,408 కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News