Friday, March 29, 2024

బంగారం కొనాలనుకుంటున్నారా !! బంగారం ధరలు పెరిగాయి

గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా మరోసారి పెరిగాయి. ఇక మామూలుగా ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మహిళలు బంగారం అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కాగా ఇప్పుడు మరోసారి బంగారం ధరలు పెరగటం మహిళలకు కాస్త ఇబ్బందికర విషయమనే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. అయితే బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 5200 తగ్గి 69,200 కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement