Saturday, May 4, 2024

240 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు.. బొగ్గు రవాణాకు ట్రాక్‌ల వినియోగం

దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నెలకొన్న బొగ్గు కొరతను తీర్చేందుకు కేంద్రం నడుం బిగించింది. దీని కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. బొగ్గు గనుల నుంచి విద్యుత్‌ ప్లాంట్‌లకు బొగ్గును తరలించే ఉద్దేశంతో.. 240 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. సాధారణంగా బొగ్గును రైల్వే ద్వారా సరఫరా చేస్తుంటుంది. ఈ బొగ్గు సరఫరాను పెంచడానికి.. కోల్‌ రేక్‌లను పెంచి ఎక్కువ మొత్తంలో సప్లై కోసం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తూ.. ట్రాక్‌లను ఎక్కువగా ఈ రేక్‌ల సరఫరాకు కేటాయించింది. 240 ప్యాసింజర్‌ రైళ్ల రద్దుతో.. దేశ వ్యాప్తంగా 400 కోల్‌ రేక్‌లను సరఫరా చేయడానికి సిద్ధపడినట్టు సమాచారం.

గతేడాది రైల్వే శాఖ 347 కోల్‌ రేక్‌లను బొగ్గు సరఫరాకు వినియోగించేది. ఈ ఏడాది 400 కోల్‌ రేక్‌లను ఇందుకు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ స్థాయిలో బొగ్గు వినియోగం గత ఐదేళ్లలోనే ఇదే తొలిసారి. భారత్‌ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ ప్యాసింజర్‌ ట్రైన్‌ల సంఖ్యను మరింత పెంచే అవకాశాలున్నాయి. మే 24వ తేదీ వరకు మొత్తం 670 రైళ్ల ట్రిప్పులను రద్దు చేయాలని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇందులో 500 రైల్వే ట్రిప్పులు సుదూరం వెళ్లే మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ రూట్లు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement