Wednesday, May 15, 2024

2023 ఏసియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌.. 6వ స్థానంలో భారత వెయిట్‌లిఫ్టర్‌

జింజు(దక్షిణకొరియా): ఏసియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌- 2023లో భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి అద్భుత ప్రదర్శన కనబరిచింది. 49కేజీల గ్రూప్‌-ఏ విభాగంలో మొత్తం 194 కేజీల బరువు ఎత్తి ఆరో స్థానంలో నిలిచారు. జియాంగ్‌ హుయిహువా(చైనా) 207కేజీలతో నిలిచి అగ్రస్థానం పొంది గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

204 కేజీలతో జహిహుయి(చైనా) ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్‌ పతకాన్ని కైవసం చేసుకోగా, 200 కేజీలతో సుక్చోరియన్‌ (థాయిలాండ్‌) మూడో స్థానంలో నిలిచి రజత పతకం చేజిక్కించుకున్నారు. గత ఆరేళ్లలో మీరాబాయి ఇదే అత్యంత తక్కువ స్థానంలో నిలవడం.

Advertisement

తాజా వార్తలు

Advertisement