Monday, May 6, 2024

20 శాతం భూభాగం రష్యా చేతుల్లో- జెలెన్‌స్కీ..

తాజా యుద్ధంలో 20 శాతం భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. లక్సంబర్గ్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 125,000 చ.కి.మి. విస్తీర్ణంలోని భూభాగం వారి చేతుల్లోకి వెళ్లిందని వివరించారు. రష్యా వల్ల 1.2 కోట్లమంది ప్రజలు వలసవెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో 50 లక్షలమంది కేవలం మహిళలు, చిన్నారులేనని చెప్పారు.

రష్యాను తాము కూడా తీవ్రంగా దెబ్బతీశామన్న ఆయన ఈ యుద్ధం ఇప్పట్లో తేలదని తేల్చిచెప్పారు.మరోవైపు గురువారం కూడా రష్యా దాడులు కొనసాగించింది. ఖార్కీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒకరు మరణించారు. ఓ స్కూలు భవనం ధంసమైంది. సుమీ నగరంలో రష్యా వైమానిక దాడులు చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు లివివ్‌ నగరంలోని రైలేలైన్లను క్షిపణులతో ధ్వంసం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement