Tuesday, May 7, 2024

ఒంగోలులో ఒమిక్రాన్‌ తొలి కేసు నిర్ధారణ..

ఒంగోలు జిల్లాలో తొలి ఒమైక్రాన్‌ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం కలవరపాటుకు గురవుతోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి (48)కి ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నగరంలోని క్లౌపేటకు చెందిన అతను గత కొన్నేళ్లుగా ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికాలో ఉంటూ.. బంధువుల వివాహ వేడుకకు ఈ నెల 16న ఒంగోలు వచ్చాడు. అయితే విదేశాల నుంచి వచ్చే ముందు అక్కడ కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది. ఒంగోలు వచ్చాక‌ వైద్య సిబ్బంది పరీక్ష చసి ఆయన న‌మూనాను హైదరాబాద్‌ సీపీఎంబీకి పంపగా ఒమైక్రాన్‌గా నిర్ధరణ అయింది.

ఆయనను ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్‌కు తరలింపి మరో సారి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత రెండు నెలల్లో విదేశాల నుంచి 826 మంది జిల్లాకు వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్‌ నిర్దారణ కాగా, వారిలో ఒకరికి ఒమైక్రాన్‌ నిర్ధరణ కాగా, మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో మరో 53 మంది చిరునామాలు తెలియక పోవడంతో వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement