Sunday, May 5, 2024

డెయిరీ ఫాంలో భారీ పేలుడు – 18 వేల గోవులు మరణం

అమెరికాలోని ఒక డెయిరీ ఫాంలో భారీ పేలుడు సంభవించి సుమారు 18,000 గోవులు చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని డెయిరీ ఫామ్‌లో సోమవారం ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు తెలిసింది. అయితే పేలుడు సంభవించడానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని స్థాని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ఒక మహిళా ఉద్యోగి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిందట. అయితే వేల సంఖ్యలో మరణించిన ఈ గోవులను టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా డెయిరీ అధికారులు పూడ్చిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నట్లు వెల్లడించారు.పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement