Sunday, April 28, 2024

UKలో విచిత్రమైన ఘటన..16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా ఆన్‌లైన్ ‘మెటావర్స్’లో సామూహిక అత్యాచారం

యూకేలో ఒక విచిత్రమైన ఆత్యాచార ఘ‌ట‌న చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా ఆన్‌లైన్ ‘మెటావర్స్’లో సామూహిక అత్యాచారం జరిగినట్లు, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వర్చువల్ రియాలిటీ గేమ్‌లో 16 ఏళ్ల బాలిక డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారానికి గురైంది. టీనేజ్ బాలిక ఆన్‌లైన్ గేమ్‌లో లీనమై ఉండగా.. కొంతమంది పురుషులు ఆమె క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. అయితే వాస్తవంగా బాలికపై అత్యాచారం జరగకున్నా, ఎలాంటి గాయాలు కాకున్నా కూడా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక బాధను అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి వర్చువల్ లైంగిక నేరం ఇదే అని భావిస్తున్నారు.

బాలికపై శారీరకంగా అత్యాచారం జరగలేదు.. కానీ మానసికంగా ఆమె బాధను అనుభవిస్తోందని, ఇది ఎక్కువ కాలం ఆమెపై ప్రభావం చూపించే అవకాశం ఉందని యూకే పోలీస్ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలాంటి కేసులపై ప్రత్యేకంగా చట్టాలు లేవని, దీంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే, బాలిక ఏ గేమ్ ఆడుతుందనేది అస్పష్టంగా ఉందని చెప్పారు.

ఇలాంటి ప్రతిష్టాత్మక కేసు దర్యాప్తు విషయంలో వర్చువల్ నేరాలను కొనసాగించాలా..? వద్దా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కేసుపై యూకే హోం సెక్రటరీ జెమ్స్ క్లివర్లీ మాట్లాడుతూ.. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్లిందని చెప్పాడు. అయితే హారిజోన్ వరల్డ్‌లో వర్చువల్ సెక్స్ నేరాలపై అనేక నివేదికలు వచ్చాయి. ఇది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే, మా ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని, మా వినియోగదారులకు ఆటోమెటిక్ రక్షణ ఉంటుందని, అపరిచిత వ్యక్తుల్ని దూరంగా ఉంటచుతుందని మెటా ప్రతినిధి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement