Tuesday, April 30, 2024

Cold Wave :వ‌ణికిస్తున్న చ‌లి… ఆ ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు బంద్

ఉత్తర భారతదేశంలో చలిగాలుల తీవ్రరూం దాల్చుతున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా జిల్లాలో తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు ఆదేశించింది. నోయిడాలోని పాఠశాలలు 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. జనవరి 3 నుంచి 6 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement