Sunday, April 28, 2024

8 కంపెనీల మార్కెట్‌ విలువలో 1.17 లక్షల కోట్లు క్షీణత..

గతవారం ఈక్విటీ మార్కెట్ల బలహీన దోరణి కారణంగా టాప్‌ 10 కంపెనీల్లోని 8 సంస్థలు భారీగా నష్టపోయాయి. వీటి మార్కెట్‌ విలువలో ఏకంగా రూ.1,17,493.78 కోట్లు ఆవిరైంది. ఇన్ఫోసిస్‌ అతిపెద్ద నష్టదాయక సంస్థగా నిలిచింది. దీనితోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌ వాల్యుయేషన్‌ క్షీణించిన ఎనిమిది కంపెనీలలో ఉన్నాయి. టాప్‌-10 జాబితాలోని కంపెనీల్లో ఐటీసీ, ఎస్‌బీఐ మాత్రమే లాభపడ్డాయి. గతవారం సెన్సెక్స్‌ 775.94 పాయింట్లు లేదా 1.28 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ రూ.66,854.05 కోట్లు తగ్గి రూ.5,09,215 కోట్లకు పడిపోయింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ వాల్యుయేషన్‌ రూ.10,880.5 కోట్లు తగ్గి రూ.9,33,937.35 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్‌ రూ.6,17,477.46 కోట్లుగా ఉన్న దాని విలువ నుండి రూ.10,462.77 కోట్లు నష్టపోయింది. టిసిఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎంకాప్‌) రూ. 10,318.52 కోట్లు తగ్గి రూ. 11,56,863.98 కోట్లకు చేరుకుంది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ ఎంక్యాప్‌ రూ.8,458.53 కోట్లు క్షీణించి రూ.5,86,927.90 కోట్లకు, హెచ్‌డిఎఫ్‌సి రూ.5,172.27 కోట్లు తగ్గి రూ.5,06,264.24 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.4,566.52 కోట్లు తగ్గి రూ.15,89,169.49 కోట్లకు చేరుకోగా, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.780.62 కోట్లు తగ్గి రూ.4,26,635.46 కోట్లకు చేరుకుంది. అయితే, ఐటీసీ విలువ రూ.15,907.86 కోట్లు పెరిగి రూ.5,07,373.82 కోట్లకు చేరుకోగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.8,746.11 కోట్లు పెరిగి రూ.4,84,561.80 కోట్లకు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement