Sunday, May 12, 2024

హ‌ృతిక్ రోషన్‌తో ప్రభాస్ మల్టీస్టారర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో నేరుగా బాలీవుడ్‌లో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఇది మాములు సినిమా కాదు.. మల్టీస్టారర్ సినిమా. ఈ మూవీలో స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఇక ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఆయన వార్, బ్యాంగ్ బ్యాంగ్ చిత్రాలను రూపొందించాడు.

కాగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే శ్యామ్’ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాల్లో ప్రభాస్ ఏకకాలంలో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న ఓ మూవీలోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాకే అతడు మల్టీస్టారర్‌లో నటిస్తాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement