Wednesday, May 15, 2024

హైదరాబాద్ : దక్షిణాదిలో కొత్త కరోనా

దక్షిణాది రాష్ట్రాల్లో మరో కొత్త రకం కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా ఎన్‌440కే రకం వైరస్‌ దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో వేగంగా విస్తరిస్తోందని సీసీ ఎంబీ ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. ఈ రకం వైరస్‌ పాజిటివ్‌ కేసులు దక్షి ణాది రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఎక్కువ గా నమోదవుతుందని తెలిపారు. ఈ రకం వ్యాప్తి తీరును సీసీఎంబీ ఎప్పటి కప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఏ కొత్త రకం వైరస్‌నైనా సకాలంలో గుర్తిస్తే అవి మహమ్మారిలా మారకుండా నిరోధించే దిశలో కీలక అడుగు వేయగలమన్నారు. ఈ మేరకు ఎన్‌440కే రకం కరోనా వైరస్‌పై సీసీఎంబీ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు గుర్తించిన కొత్త సార్స్‌ కరోనా రకం వైరస్‌లన్నీ స్పైప్రొటీన్లలో మ్యుటేషన్ల కారణంగానే ఉద్భవించాయని పేర్కొన్నారు. మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ పైపొర మానవుల శరీర కణాల్లోకి మరింత సులువుగా, వేగంగా చొచ్చుకువెళుతుందని గుర్తించినట్లు చెప్పారు. కొన్ని రకాల వైరస్‌లు మ్యుటేషన్ల కారణంగా మరింత శక్తిని సమకూర్చుకుంటాయని, ఏకంగా మానవులు మందుల ద్వారా, ఆహారం ద్వారా సమకూర్చుకున్న రోగ నిరోధక శక్తిని కూడా ధ్వంసం చేస్తాయని వెల్లడించారు. కరోనా వైరస్‌ మ్యుటేషన్లపై దేశంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 5 శాతం మందిని సీసీఎంబీ అధ్యయనం చేసిందన్నారు. ఎన్‌440కే వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్‌, వైద్య చికిత్సపైనే ఆధార పడవద్దని, మాస్కులు ధరించడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సీసీఎంబీ పరిశోధనలు డాక్టర్‌ దివ్య తేజ్‌, డాక్టర్‌ సురభి శ్రీవాత్సవ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement