Friday, May 17, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత ఒకింత తగ్గింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా కాటుకు ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,277కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,614కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement