Friday, April 26, 2024

శార్దూల్‌ ఇన్‌.. అక్షర్‌ ఔట్‌

ముంబై : టీమిండియా టీ20 ప్రపంచకప్‌ తుది జట్టులో శార్దూల్‌ ఠాకూర్‌కు చోటు దక్కిం ది. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానం లో అతడిని జట్టులోకి తీసుకు న్నారు. ఈ మేరకు బుధవారం బీసీసీఐ ప్రకటించింది. అక్షర్‌ పటేల్‌ స్థానంలో స్టాండ్‌ బై ఆట గాడు శార్దూల్‌ ఠాకూర్‌ రెగ్యులర్‌ ప్లేయర్‌గా ఆడుతాడు. అయితే అక్షర్‌ పటేల్‌ స్టాండ్‌ బై ప్లేయర్‌గా కొనసాగుతాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడుతున్న 29 ఏళ్ల ఠాకూర్‌.. తన ఖాతాలో 18 వికెట్లు వేసుకున్నాడు. టీం మేనేజ్‌మెంట్‌తో పాటు ఆలిండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. 15 మంది సభ్యుల బృందంలో ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్టాండ్‌ బై ఆటగాడిగా ఉంటాడని వివరించారు. ఈ కీలక మార్పుతో పాటు మరో 8 మంది ఆటగాళ్లు జట్టుతో పాటే ఉండాలని స్పష్టం చేశారు.
టీ20 ప్రపంచ కప్‌ జట్టు : కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), సూర్య కుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవ ర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి.

స్టాండ్‌ బై ప్లేయర్స్‌ : శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌. 24వ తేదీన పాకిసా ్తన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడు తుందని షా వివరించారు. వీరం తా దుబాయ్‌లోని బయో బబుల్‌లో చేరుతారు. అవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షల్‌ పటేల్‌, లుక్మన్‌ మెరివాలా, వెంక టేశ్‌ అయ్యర్‌, కర్ణ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌తో పాటు గౌతమ్‌లు టీమిండియా సన్నాహాల్లో సహా యపడుతారని వివరించారు.


టీమిండియా జెర్సీ అదుర్స్‌


టీ20 ప్రపంచ కప్‌-2021కు సం బంధించిన టీమిండి యా జెర్సీని భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీ ఐ) ఆవిష్కరించింది. ఈ నయా జెర్సీలు ధరించిన టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను బుధవారం ట్విట్ట ర్‌లో పంచుకుంది. బిలియన్‌ చీర్స్‌ జెర్సీని ఆవిష్కరిస్తున్నా మని.. దేశ వ్యాప్తంగా ఉన్న అభి మానులను స్ఫూర్తిగా తీసుకొని ఈ జెర్సీని రూపొం దించామని ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. మెన్‌ ఇన్‌ బ్లూ కాస్త.. థిక్‌ బ్లూగా మార్చేశారు. నేవీ బ్లూ కలర్‌లో ఉన్న ఈ జెర్సీపై ముందు భాగంలో రాయల్‌ బ్లూ కలర్‌ షేడ్స్‌ కనిపిస్తున్నాయి. దానిపై టీమిండియా కిట్‌ స్పాన్సర్‌ అయిన ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌, బైజూస్‌ సంస్థల పేర్లు తెల్లని రంగులో కనిపిస్తాయి. ఆరెంజ్‌ కలర్‌లో ఇండియా పేరు ఉంటుంది. ఎడమవైపు బీసీసీఐ లోగోతో పాటు మూడు చుక్కలు కనిపిస్తాయి. టీమిండియా గెలిచిన మూడు ప్రపంచ కప్‌లకు సంకేతంగా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement