Thursday, May 2, 2024

డెహ్రాూన్ : ధౌలిగంగలో పెరిగిన నీటిమట్టం : సహాయక చర్యలకు అంతరాయం

ఉత్తరాఖండ్ లో కొద్ది రోజుల కిదట మంచు చెరియలు విరిగిపడటంతో ధౌలిగంగా నది ఉప్పొంగిన ఘటనలో వందల మంది గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన వారి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలకు  ఈ రోజు విఘాతం కలిగింది. నాటి ఘటనలో ఇంకా 178 మంది ఆచూకి తెలియాల్సి ఉండగా, గాలింపు చర్యలు ఉదృతంగా సాగుతున్నాయి. అయితే ఈ ఉదయం ధౌలిగంగా నది ప్రవాహం హఠాత్తుగా పెరగడంతో గాలాంపు చర్యలకు విఘాతం కలిగింది. నిన్న సాయంత్రం నుంచే ప్రవాహ ఉదృతి, నది నీటిమట్టం పెరుగుతూ వస్తున్నాయని, ఈ ఉదయానికి ప్రవాహ ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరడంతో గాలింపు చర్యలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.కా తెలియరాలేదన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement