Saturday, April 27, 2024

ఒక్కరి పీఎఫ్ ఖాతాలోనే రూ.103 కోట్లు

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తాము సంపాదించే సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. పదవీ విరమణ తర్వాత ఆ సొమ్మును పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు ఉపయోగిస్తుంటారు. ఈ పీఎఫ్ సొమ్ము అనేది వ్య‌క్తి పొందే వేత‌నం, స‌ర్వీసు బ‌ట్టి ఒక్కక్క‌రికి ఒక్కోలా ఉంటుంది. అందువ‌ల్ల రిటైర్మెంట్ త‌ర్వాత కొంద‌రికి రూ.2 లక్షలు వ‌స్తే, మ‌రికొందరికి రూ.20-30 లక్షల వరకు వ‌స్తాయి. కానీ మ‌న దేశంలోని ఒక వ్య‌క్తి పీఎఫ్ ఖాతాలో ఏకంగా రూ.103 కోట్లు జ‌మ అయ్యాయి. మరో ఇద్దరి ఖాతాల్లో కూడా రూ.86 కోట్లు చొప్పున జమ అయినట్లు కేంద్రం గుర్తించింది. అంతేకాదు అత్య‌ధికంగా పీఎఫ్ సొమ్ము జ‌మ‌చేసిన టాప్‌-20 మంది సొమ్ము రూ.825 కోట్లు, టాప్‌-100 మంది సొమ్ము రూ.2వేల కోట్లు ఉంద‌ని కూడా ప్ర‌భుత్వం లెక్క‌లు కట్టింది.

అయితే ఫీఎఫ్ ఖాతాల్లో అత్యధికంగా సొమ్ము ఉన్నవారి పేర్లను కేంద్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో డ‌బ్బును పొదుపు చేస్తున్న వారికి పీఎఫ్ ఖాతాలో నగదు వ‌డ్డీపై ప‌న్ను మినహాయింపు ఇవ్వ‌డం క‌రెక్టు కాద‌ని కేంద్రం భావించింది. ఇక‌పై ఏడాదికి రూ.2.5 ల‌క్ష‌లు, అంత‌కుమించి త‌మ పీఎఫ్ ఖాతాలో జ‌మ ‌చేసుకునే వారికి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టంబచేసింది. అయితే ఈ నెల 31 వ‌రకు పీఎఫ్ ఖాతాల్లో జ‌మ‌య్యే సొమ్ముపై వ‌చ్చే వ‌డ్డీకి మాత్రం ఎలాంటి ప‌న్నులు వేయ‌బోర‌ని, ఏప్రిల్ 1 నుంచి ఏడాదికి 2.5 ల‌క్ష‌ల‌కుపైగా పీఎఫ్ ఖాతాలో జ‌మ‌చేసుకునే వారికి వ‌డ్డీపై ట్యాక్సుల వ‌డ్డింపు ఉంటుంద‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement