Saturday, April 27, 2024

అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్ల లొల్లి

ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ మళ్లిd మొదలయ్యేలా కనిపిస్తోంది. పాలమూరు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఆర్డీఎస్‌ హెడ్‌ వర్క్స్‌ వద్ద ఏపీ కొత్త కాల్వ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో తెలంగాణ రైతులు మండి పడుతున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా కుడి కాల్వ నిర్మిస్తున్నారని భగభగలాడుతున్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు మాత్రమే సాగునీరు వాడుకునే అవకాశం ఉంది. ఏపీ సర్కార్‌ విజ్ఞప్తితో నాలుగు టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఏపీకి ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. అయితే దీనికి అనేక షరతులు పెట్టింది. ఆర్డీఎస్‌ దగ్గర నిర్మాణం చేపట్టాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. దీంతో పాటు తుంగభద్ర దగ్గర నీటి స్థాయిని కూడా అంచనా వేసుకోవాలి. వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ సర్కార్‌ నిర్మాణం చేపట్టిందని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ఇంజనీర్లు ఫిర్యాదు కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement