Wednesday, May 1, 2024

నేటి సంపాద‌కీయం – ఉక్రెయిన్‌కు పెరుగుతున్న మద్దతు

ఏడు రోజులుగా రష్యా దాడులను తిప్పికొడుతూ వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైన్యాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ అభినందించారు. ఉక్రెయిన్‌కి భారీగా ఆర్థిక సాయాన్ని అందజేస్తా మనీ, బలగాలను మాత్రం పంపబోమని స్పష్టం చేశారు. అదే సందర్భంలో రష్యాకు బిడెన్‌ తీవ్ర పదజాలంతో హెచ్చరిక చేశారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ ఎలుగెత్తి కోరుతున్నా రష్యా తన వైఖరిని మార్చుకోకపోవడంవల్ల సంభవించే పరిణామాలను పుతిన్‌ గ్రహించినట్టు లేదని అన్నారు. పుతిన్‌ దురహంకారంతో వ్యవహరి స్తున్నారని బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మరో వంక రష్యన్‌ దళాలు ఎంత ప్రయ త్నించినా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ని స్వాధీనం చేసుకోలే కపోతున్నాయి. అయితే,ఖర్కీవ్‌లో ఆకాశ హర్మ్యాలపై రష్యన్‌ సైనికుల దాడులు అధిక మయ్యాయి.ఖర్కీవ్‌ నుం చి వీలైనంత త్వరగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అక్కడ ఇంకా ఉన్న భారతీయులను కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఉక్రెయిన్‌ని ఆక్రమించు కోవడం తమ ఉద్దేశ్యంకాదని పుతిన్‌ మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, ఖర్కీవ్‌ తదితర ప్రాంతాల్లో రష్యన్‌ సైనికుల మోహరింపు చూస్తే ఆయన చెబుతున్నది నిజం కాదనిపిస్తోంది.

క్రిమియా మాదిరిగా కీవ్‌,ఖర్ఖీవ్‌ వంటి ప్రధాన నగరాలను స్వాధీ నం లోకి తెచ్చుకోవడమే పుతిన్‌ వ్యూహంగా కనిపిస్తోంది. కీవ్‌లో టెలివిజన్‌ టవర్‌ని రష్యన్‌ సైనికులు ధ్వంసం చేశారు. మరో వంక రష్యన్‌ సైనికులు 5,840 మందిని తమ సేనలు హతమా ర్చాయని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ప్రకటించింది.రష్యన్‌ సైనికులకు తిండి,విశ్రాంతి లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆర్థిక ఆంక్షల వల్ల రష్యా ఉక్కిరిబిక్కిరి అవుతోందనీ,రష్యాకు నోటి మాట ద్వారా సాయం అందించేదేశాలే కరువయ్యాయని ఆయన అన్నారు.. ఉక్రెయిన్‌ని ఆక్రమించుకోవడం రష్యావల్ల కాదనీ, కేవలం విధ్వంసాన్ని సృష్టించడానికే దాడులను ముమ్మరం చేశారని బ్రిటిష్‌ ప్రధాని జాన్సన్‌ స్పష్టం చేశారు. యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా, జపాన్‌,కెనడా రష్యాతో ఆర్థిక లావాదేవీలను బంద్‌ చేశాయి. మరో వంక ఉక్రెయిన్‌కి ప్రపంచ బ్యాంకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో వెలువడే స్ఫూత్నిక్‌, రష్యా టుడే వంటి పత్రికలను యూరప్‌ అంతటా నిషేధించారు.రష్యా వైపున భారీ నష్టం వాటిల్లుతున్నా పుతిన్‌ మొండి వైఖరి వల్లనే దాడులు కొనసాగుతున్నాయి.

పుతిన్‌ వైఖరిని రష్యన్లే తప్పు పడుతున్నారు. ఈ ఏడాది చాంపియన్స్‌ లీగ్‌ క్రీడలకు పీటర్స్‌ బర్గ్‌ ఆతిధ్యమిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.అలాగే, రష్యాను ఏకాకిగా చేసే ప్రయ త్నాలు అన్ని రంగాల్లో ముమ్మరంగా సాగుతు న్నాయి. భారతీయులను స్వదేశానికి తరలించడంలో సాయప డతామని పుతిన్‌ ప్రకటించారు.ఉక్రెయిన్‌ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశం తరలి వెళ్లేందుకు సాయపడుతున్నామని రష్యా రాయబారి తెలిపారు. అయితే, ఆపరేషన్‌ గంగ కార్యక్రమం కింద ఇప్పటికే 16 వేలమంది భారతీయులను స్వదేశానికి మోడీ ప్రభుత్వం సురక్షితంగా తరలించింది.ఉక్రెయిన్‌లో జిందాల్‌ అనే భారతీయ విద్యార్ధి అనారోగ్య కారణా లవల్ల మరణించాడు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నత స్థాయిసమావేశంలో ఆపరేషన్‌గంగ కార్య క్రమం తీరుతెన్నులను ఎప్పటికప్పుడు సమీక్షిసు ్తన్నారు. అమెరికా మరింత దూకుడును ప్రదర్శించాలని అమెరికన్‌ నగరాలో పౌరులు ప్రదర్శనలు నిర్వహించి బిడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే,బ్రిటన్‌లో ప్రధాని జాన్సన్‌ నిర్వహించిన పత్రికా గోష్టిలో ఒక మహిళా విలేఖరి నేరుగా జాన్సన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. మొక్కుబడి ప్రకటనలు కాదు, చర్యలు కావాలంటూ ఆమె గొంతెత్తి డిమాండ్‌ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా రష్యా చర్యలను చైనా, పాకిస్తాన్‌లు తప్ప అన్ని దేశాలూ తీవ్రంగా దుయ్యబడుతున్నారు. చైనాలో కూడా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వైఖరి పట్ల నిరసన వ్యక్తం అవుతోంది.ఉక్రెయిన్‌ పట్ల సర్వత్రా సానుభూతి పెరుగు తోంది.ముఖ్యంగా, దాడుల్లో ఉక్రెయిన్‌ పట్టణా లు, నగ రాలు మరుభూములుగా మారుతున్న దృశ్యాలు చూసి ప్రతిఒక్కరూ స్పందిస్తున్నారు.ఈ దాడుల వల్ల ఇంతవరకూ రష్యా సైనికంగా బాగా నష్టపోయినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement