Sunday, April 28, 2024

నేటి సంపాదకీయం – ‘అమితా’నందం!

కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి ముందుగా అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించా లని మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ తరచూ అనేవారు. ప్రజల విశ్వాసం చూరగొననిదే ఎన్నివేల కోట్ల రూపాయిలు రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసినా ప్రయోజనం లేదని పలువురు నాయకులు సైతం అన్న మాటల్లో సారూప్యత ఉంది. కాశ్మీర్‌ ప్రజలు తమ నాయకుల మాటనే ఎందుకు వింటున్నారు.

కేంద్రం ఇచ్చే నిధులు, కల్పించే సౌకర్యాలతో సంతృప్తి చెందకుండా కేవలం తమ రాష్ట్రానికి చెందిననాయకుల మాటలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? ఈ విషయాన్ని కేంద్రంలో అధికారం మారిన ప్రభుత్వాలు లోతుగా ఆలోచించి ఉంటే మన్మోహన్‌ వ్యాఖ్యకు సమాధానం దొరికి ఉండేది. ఆయన ట్రస్ట్‌ డిఫిసిట్‌ అనే పదాన్ని తరచూ ఉపయోగించే వారు. కాశ్మీరీల విశ్వాసాన్ని చూరగొనడమని దాని అర్ధం. డబ్బు, నిధులు, సౌకర్యాలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేమన్న సంగతి పాలకులు గ్రహించాలన్నది మన్మోహన్‌ అభిప్రాయం.

అయితే, ఆయన హయాంలో ఉన్నప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. భిన్నాభిప్రాయాలు కలిగిన పార్టీలన్నీ కేంద్రంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కూటమిగా ఏర్పడ్డాయి. ఈకూటమిలో చాలా పార్టీలు కాశ్మీరీ పార్టీలకు అనుకూలమైనవే. ఉదాహరణకు కాశ్మీర్‌లో ప్రధానమైన పార్టీ అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌కి బాగా సన్నిహితమైనవి.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధానినరేంద్ర మోడీ ప్రభుత్వం మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకే ప్రాధాన్యం ఇచ్చేది. ఈ రెండు పార్టీలూ కాశ్మీర్‌లో వేర్పాటువాద సం ఘాల సమాఖ్య అయిన హురియత్‌ కాన్ఫరెన్స్‌కి అనుకూలమైన పార్టీలు.

- Advertisement -

పాకిస్తాన్‌తో చర్చల ద్వారానే కాశ్మీర్‌ సమస్య పరిష్కారం అవుతుం దని గట్టి నమ్మకంతోఉన్నాయి. ఇందుకు భిన్నంగా ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కాశ్మీరీలతోనే మాట్లాడాతానంటూ మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు బయలుదేరి, అక్కడి ప్రజలతో కలగలసిపోయారు. భద్రతా పరమైన జాగ్రత్తలు, సాయుధ పోలీసుల రక్షణ, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ లేకుండానే ప్రజలందరితో కలిసి పర్యటించారు. తమ మీద ఆయనకు ఎలాంటి అనుమానం లేదన్న భావన వారికి కలిగించారు. దీని ద్వారా కాశ్మీరీల్లో విశ్వాసా న్ని ప్రోదిచేసినట్టుగా ఆయన చెప్పుకుంటున్న మాటల్లో కొంతైనా నిజముంది. సాధారణం గా చిన్న నాయకుని మొదలు, ప్రధానమంత్రి స్థాయి నాయకుని వరకూ కాశ్మీర్‌లో ఎవరు పర్యటించినా కేంద్ర ప్రభుత్వ భద్రతాదళాలే కాకుండా, సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల రక్షణ శాఖకు చెందిన సాయుధులైన అధికారులు విఐపీలకు కవచాలుగా కనిపిస్తూ ఉంటారు.

ఈసారి అటువంటి హడావుడి ఏదీ కనిపించలేదు. అమిత్‌ షా పర్యటన అంతా సాదాసీదాగానే సాగింది. ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. అలాగే, వారడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానమిచ్చారు. ప్రజల్లో విశ్వాసాన్నిప్రోది చేసే ప్రయత్నమంటే ఇంకేం కావాలి? ఆయన స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో కాశ్మీర్‌పై పాక్‌ నాయకులతో మాట్లాడాలంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన ప్రకటనను పలువురు ఉటంకించారు. సాధారణంగా ఇలాంటి ప్రస్తావన రాగానే దాని మీదే దృష్టి పోతూ ఉంటుంది. అసలు విషయం వెనక్కి వెళ్తూ ఉంటుంది. అమిత్‌ షా చాలా నేర్పుగా, ఓర్పుగాఅంటే ఎవరి మీదా చిరాకు పడకుండా, వారు చెప్పింది వింటూ నేను మీరు చెప్పింది వినడానికీ,మీతో మాట్లాడటానికి వచ్చాను అని అనగానే తమకు కేంద్ర మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వారిలో ఏర్పడింది. ఫరూక్‌ సహా పలువురు కాశ్మీరీ నాయకులు తనను దూషించినా తాను స్పందించలేదనీ, తాను మౌనం పాటించ డం వల్ల వారి మాటలను ప్రజలు పట్టించుకోలేదని అమిత్‌ షా అన్నారు.

భారతీయ సంస్కృతి మూల సిద్ధాంతం ఇదేననీ, మాటకు మాట సమాధానమిస్తే వివాదాలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు. అలాగే, ప్రజలకు ఏం కావాలో సూటిగా అడిగి తెలుసు కున్నానని, కేంద్రం కల్పించే సౌకర్యాల పట్ల వారి స్పందన కూడా తెలుసుకున్నానని అమిత్‌ చెప్పారు.వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకుండా తనపని చక్కబెట్టుకుని రావడం అంటే ఇదే. అమిత్‌ షా ఈ విషయంలో చాలా సంయమనాన్ని ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement